calender_icon.png 14 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హంగ్’లో ఎవరికీ మద్దతివ్వం!

14-02-2026 01:11:20 AM

  1. మున్సిపల్ ఫలితాలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ముందడుగు
  2. 13నుంచి 20కి పెరిగిన ఓటు శాతం 
  3. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీజేపీని అడ్డుకున్నాయి
  4. బీఆర్‌ఎస్ దిగజారుతున్న పార్టీ
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):  ‘మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికీ సపోర్ట్ చేయదు. ఎక్కడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వమని, ప్రతిపక్షంగానే ఉంటాం’ అని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు స్పష్టం చేశారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల ఫలితాలపై రాంచందర్ రావు మాట్లాడారు.

గతంలో కంటే ఈ సారి మా బలం పెరిగిందని  ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు అధికారికంగా  250కిపైగా వార్డుల్లో బీజేపీ విజయం సా ధించిందని తెలిపారు.  ప్రజాతీర్పు కాంగ్రెస్ పక్షాన లేదని, రెండోస్థానంలో వచ్చామని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో ఫెయిలైందని విమర్శించారు. 

ఈ ఫలితాలు రానున్న రోజుల్లో బీజేపీకి ముందు మెట్లు అన్నారు. మొట్ట మొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకెళ్తోందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 70 డివిజన్ల వరకు గెలిచే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మంచిర్యాల, రామగుం డం, నల్లగొండ తదితర ప్రాంతాల్లో గతంలో కంటే బీజేపీ మెరుగుపడిందని, మొత్తం కార్పొరేషన్లు,

వార్డు మెంబర్లు కలిపి 320 నుంచి 350 స్థానాల్లో బీజేపీ విజయం సాధించే దిశగా ఉందన్నారు. 5 మున్సిపాలిటీలను  కైవసం చేసుకుంటున్నామని,  వే ములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్‌పల్లి.. ఈ ప్రాంతాల్లో చైర్మన్ పదవులను కూడా బీజేపీ గెలుచుకుంటోందన్నారు. గతంలో 2 మున్సిపాలిటీల్లోనే గెలవగా,  241 వార్డు మెంబర్లు గెలిచామని, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగిందన్నారు.  

కాంగ్రెస్‌ది చెప్పుకునేంత గెలుపుకాదు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఫలితాలు సా ధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, అయినప్పటికీ కాంగ్రెస్‌కు స్ప ష్టమైన మెజారిటీ రాలేదన్నారు. చాలాచోట్ల హంగ్ పరిస్థితి ఉందని... దీంతో కాంగ్రెస్ చెప్పుకునేంత గొప్ప విజయమేమీ కాదని విమర్శించారు. సాధించిన విజయాలు కూ డా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనే అని విమర్శించారు. బీజేపీ ఎదు గుతున్న పార్టీ అని, బీఆర్‌ఎస్ దిగజారుతున్న పార్టీ అని పేర్కొన్నారు. బీజేపీ ఓటు షేర్ 13 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందన్నారు.  

మజ్లిస్ మద్దతుతోనే చాలా చోట్ల గెలిచాయి 

మజ్లిస్ మద్దతుతోనే చాలా చోట్ల కాంగ్రె స్, బీఆర్‌ఎస్ గెలిచాయని, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ గెలుపును అడ్డుకునే లక్ష్యంగా రెండోస్థానంలో కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముస్లిం ఓటర్లకు పిలుపునిచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ మధ్య “ఫెవిక్విక్ బంధం” ఉందన్నారు. మజ్లిస్ మద్దతు లేకుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలవలేవన్నారు.  రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేప థ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి మజ్లిస్‌కు ఒక మే యర్ సీటు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి, పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, నాయకులు రామకష్ణ, రా ణా ప్రతాప్ పాల్గొన్నారు.