22 May, 2026 | 12:57 AM

నాగబంధం హంగామా

22-05-2026 12:13 AM

విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న మైథలాజికల్ యాక్షన్ -అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఇందులో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషబ్ సావ్నే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తులు, అడ్వెంచర్, హై-ఆక్టేన్ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను జీ స్టూడియోస్ సొంతం చేసుకుందని వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో కథానాయకుడు విరాట్ కర్ణ.. వర్షం, చీకటి, అగ్నిజ్వాలల మధ్య కనిపించిన తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.