21 May, 2026 | 8:31 PM

ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ

21-05-2026 07:47 PM

టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. 

టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి  పట్టణంలోని రాజీవ్ పార్కులో  రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. 

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, యువతకు అవకాశాలు కల్పించడంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేయడంలో రాజీవ్ గాంధీ చేసిన. కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. 

అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి లో  నిర్మలా జగ్గారెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పారు. 

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, సి డి సి చైర్మన్ గడిలా రామ్ రెడ్డి,సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్,  కూన సంతోష్, ప్రభు గౌడ్ ,  కౌన్సిలర్లు తోపాజి వీణ హరీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.