కెరమెరిలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
21-05-2026 05:06 PM
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కెరమెరి మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు తహసీల్దార్ పి. నాగార్జున గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మద్దతు తెలిపారు. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో జొన్న సాగు జరిగిందని, రైతుల వద్ద 30 వేల క్వింటాళ్లకు పైగా నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని జైనూర్‌లో ఏర్పాటు చేయడంతో రవాణా ఖర్చులు, కాంటా ఆలస్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.జిల్లా అధికారులు స్పందించి కెరమెరి మండల కేంద్రంలోనే జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.






