ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.. వడ్డే నవీన్‌కు గట్టి కమ్‌బ్యాక్
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు. జూన్ 19న విడుదల కాను న్న ఈ సినిమా టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడుతూ.. “పరిస్థితుల కారణంగా బ్రేక్ వచ్చింది.
నా వద్దకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. ఎన్నో కథలు విన్నా. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే కమల్ చెప్పాడు. కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం పనిచేశాం. పదేళ్ల తర్వాత నేను నటిస్తున్న, నిర్మిస్తున్న తొలి చిత్రమిది. కంటెంట్ కొత్తగా ఉంటుంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు.
‘ఈ సినిమాలో నాకు లక్ష్మీ అనే మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ చాలా గట్టిగా ఉంటుంద’ని హీరోయిన్ రాశీ సింగ్ తెలిపింది. ‘వడ్డే నవీన్ రీ ఎంట్రీ, కమ్‌బ్యాక్ ఆయన అభిమానులు కోరుకున్నట్టుగానే ఉంటుంద’ని దర్శకుడు కమల్ తేజ నార్ల చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, కే మ్యూజిక్ బాధ్యురాలు ప్రియాంక, చిత్రబృందం కూడా మాట్లాడారు.






