22 May, 2026 | 12:57 AM

స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్!

22-05-2026 12:17 AM

‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అంటూ ‘ది ఇండియా స్టోరీ’ చిత్రబృందం పంచుకున్న డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషియో-నేషనల్ డ్రామానే ‘ది ఇండియా స్టోరీ’. చెట్టన్ డీకే దర్శకత్వంలో సాగర్ బీ షిండే రచించి నిర్మిస్తున్న చిత్రమిది.

జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమా.. రసాయనాల దుర్వినియోగం, ముఖ్యంగా పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇదే ఏడాది జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని టీమ్ తాజాగా వెల్లడించారు.

ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ కథను దాటి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న సామాజిక సంక్షోభాన్ని ఈ చిత్రం ప్రతిబింబించనుంది. పరిశ్రమల నిర్లక్ష్యం, దాని వెనుక పొంచిఉన్న ప్రమాదాలు, సమాజంలో అవగాహన, బాధ్యత ఎంత అవసరమో.. ఈ కథ ద్వారా చూపించబోతున్నారు. ఈ మూవీ టీజర్ కూడా త్వరలో రానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిశాంత్ భగవత్; సంగీతం: మంగేశ్ ధక్డే; ఎడిటర్: ఆశిష్ మాథ్రే.