మోదీ ప్రభుత్వ ఫాసిస్ట్ విదానాల్లో భాగమే ఎస్‌ఐఆర్
న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె.వి చలపతి రావు
కట్టంగూరు, ఏప్రిల్ 26 : కేంద్రంలో ఆర్.ఎస్.ఎస్ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను వేగవంతం చేసిందని, అందులో భాగమే ఎస్.ఐ.ఆర్ - డీ లిమిటెషన్ విధానమని సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ జె.వి చలపతి రావు అన్నారు.
నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో సీపీఐ (యం -యల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ తన రహస్యం ఎజెండాను అమలు చేయడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్.ఐ.ఆర్ మరియు డీ లిమిటెషన్ పద్ధతిని తీసుకువచ్చిందని అన్నారు.
దీని మూలంగా దక్షిణ భారత్ ప్రజలపై సామజిక, రాజకీయ, ఆర్థిక దోపిడీకి, అసమానతలకు పరాకాష్టగా మారుతుందని అన్నారు. బీజేపీ కేంద్రంలో నాలుగోసారి అధికారంలోకి రావడానికి మార్గం సులభం చేసుకుంటుందని ఉత్తర భారత్ లో పార్లమెంట్ సీట్లు పెంచి, దక్షిణాది రాష్ట్రాలను ఆస్థిర పరుస్తుందని అన్నారు. ఓట్ల తొలగించడం, ప్రజా ఉపయోగ చట్టాలను రద్దు చేయడం లాంటి విధానాలను అనుసరిస్తూ ఫాసిస్ట్ రాజ్య నిర్మాణానికి పాల్పడుతున్నాదని అన్నారు.
డీ లిమిటేషన్ భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి సాగర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్, ఐఎఫ్ టియూ రాష్ట్ర నాయకులు అరుణక్క, ఏ ఐ కే యం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు కంచనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






