27 April, 2026 | 2:00 AM

స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి

27-04-2026 12:22 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అన్నారు. జనగణన-2027లో భాగంగా ఆదివారం నుండి మే 10 వరకు నిర్వహించనున్న స్వీయ గణనపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వీయ గణన ప్రక్రియ నేటి నుండి 10 మే 2026 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.కావున ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, సౌకర్యాలు మొదలైన అంశాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేయవచ్చన్నారు. ఈసారి జనగణనలో మొదటిసారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది దేశాన్ని డిజిటల్ దిశగా తీసుకెళ్లే ముఖ్యమైన అడుగు అన్నారు.

తదుపరి స్వీయ గణనలో ముఖ్య అంశాల గురించి వివరిస్తూ వివరాల నమోదు, సబ్మిట్ చేసే అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, ఎస్ ఓ లు ఇస్లావత్ ఓబులాలు, వి రామారావు, రాజేష్, దున్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్ : జనగణన -2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వయంగా పూర్తిచేశారు. ప్రతి కుటుంబం స్వీయ గణనలో పాల్గొనాలని, సరైన, పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.