బోగస్ ఓట్ల తొలగింపునకు ‘సర్’ మంచి అవకాశం
భైంసా జులై 9 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో ప్రాధాన్యమైందని అర్హులైన ఒక్కరికి ఓటుహక్కు కల్పించి బోగస్ ఓట్లను తొలగించడానికి సర్ ఉపయోగించుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సర్ ప్రక్రియపై బిజెపి నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విదేశీయులు దేశంలో చొరబడకుండా, ఉండటానికి సర్ ఎంతోగానో దోహదం చేస్తుందని భోగస్ ఓట్ల తొలగింపుకు ఇది మంచి అవకాశం అన్నారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్. ఐ. ఆర్. లో గ్రామాల వారిగా బిఎల్వోలకు బిజెపి బిఎల్‌ఎ లు సహకరించాలన్నారు. భైంసా తో పాటు కుబీర్, ముధోల్, తానుర్, బాసర మండల కేంద్రంల్లో పెద్ద మొత్తంలో భోగస్ ఓట్లు ఉన్నాయని ఎస్. ఐ. ఆర్.తో అంతా తేటతెల్లమవుతుందన్నారు.
ఏవైనా అనుమానాలు ఉంటే, అధికారులను సంప్రదించాలని, అర్హులైన వారి ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బిజెపి నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ బిజెపి ఎస్. ఐ. ఆర్. జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, ముధోల్ నియోజకవర్గ బిజెపి సర్ ఇంచార్జ్ పైడి పల్లి గంగాధర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, ఏనుపోతుల మల్లేష్, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము, బిజెపి మండలాల అధ్యక్షులు, సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.






