10 July, 2026 | 4:19 AM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

10-07-2026 01:11 AM

మేడిపల్లి, జూలై 9 (విజయక్రాంతి): బో డుప్పల్ సర్కిల్, మేడిపల్లి పరిధిలోని కమలానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేడిపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. గురువారం మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రాజోజు నరసింహా చారి ఆధ్వర్యంలో,డిస్ట్రిక్ట్ 320F, రీజియన్6, జోనల్ చైర్పర్సన్ లయన్ వేముల నాదం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జోనల్ చైర్ పర్సన్ లయన్ వేముల నాదం గౌడ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మేడిపల్లి లయన్స్ క్లబ్ తరుపున విద్య, వైద్యం, సేవా రంగాల్లో మరిన్ని ప్రజా ఉపయోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లయన్ మేకల మల్లేశం, లయన్ లావణ్య, లయన్ సోమేశ్వర్, లయన్ సావిత్రి, లయన్ దుర్గ, లయన్ పల్లె బాలరాజు, కోశాధికారి లయన్ మహేందర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాలనీవాసులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.