తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
11-03-2026 12:05 PM
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla Sworn) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్(Telangana Governor) తెలుగులో ప్రమాణం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ లోక్ భవన్‌లో శుక్లా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన శివ ప్రతాప్ శుక్లా దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.




