నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు
- వంది శాతంతో సబ్సిడీతో బీసీ మహిళలకు పంపిణీ
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపా ర అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధి గల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నియోజకవర్గాని కి 1000 మంది మహిళలకు వంద శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం అమలుపై బీసీ సంక్షే మ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా నిర్వహించారు.
ఈ సం దర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శా తం సబ్సిడీతో మంజూరు చేయాలని ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. సీఎం సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణ యం తీసుకున్నామని స్పష్టం చేశారు.






