ఏపీ సీఎం చంద్రబాబుకు అవార్డు పట్ల హర్షం
27-04-2026 12:14 AM
కోదాడ, ఏప్రిల్ 26 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ’ఎకనామిక్ టైమ్స్’ సంస్థ నుండి ’బిజినెస్ బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కడం ప్రతి తెలుగు బిడ్డకు గర్వకారణమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగూరు జోష్ణ శ్రీధర్ అన్నారు.
ఆదివారం కోదాడలో మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేనీ సైదేశ్వరరావు ఆహ్వానం మేరకు వారి నివాసంలో టిడిపి నాయకులతో కలిసి జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఆమెను శాలువా, పూల బొకే లతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నాయకులు కట్టా సతీష్, గుండు నాగేశ్వరరావు, బాబా తదితరులు పాల్గొన్నారు.






