16 July, 2026 | 1:08 AM

రామగుండంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్

16-07-2026 12:55 AM

కాంగ్రెస్లోకి ఇద్దరు కార్పొరేటర్లు కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ 

రామగుండం, జూలై 15(విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, పలువురు ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం 28వ డివిజన్ కార్పొరేటర్ ధారంగుల కుమార్, 26వ డివిజన్ కార్పొరేటర్ భగవత్ నరసింహ సారయ్య నాయక్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శివరాత్రి గంగాధర్తో పాటు ఆయా డివిజన్లకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దీంతో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ లో చేరిన వారికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు వీటి బాలరాజు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్, కుందనపల్లి సర్పంచ్ అరుకుటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని, నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేతో కలిసి ప్రజాసేవలో కొనసాగుతామని పేర్కొన్నారు.ఈ చేరికతో రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.