16 July, 2026 | 1:16 AM

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ

16-07-2026 01:04 AM

మంథని, జూలై 15(విజయ క్రాంతి) మంథని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల రాజ పోచయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,50,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్‌ఓసీ మంజూరైంది.బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబును సంప్రదించి వైద్య సహాయం కోరగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

అనంతరం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆస్పత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ అందజేశారు.ఈ సందర్భంగా చిట్యాల రాజ పోచయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించి వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అందించిన ఈ సహాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని వారు పేర్కొన్నారు.