బాలిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
మెట్ పల్లి, జులై 15(విజయక్రాంతి):మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో 2020లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేస్ నిందితులు లోకిని రాజేష్, దారంగుల సాయి కుమార్, మొగిలిపాక అనిల్ కుమార్, కుంచెపు శివ కుంచెపు వెంకటేష్ అనే ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నిందితులపై మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ సదాకర్ కేసు నమోద్ చేయడం జరిగింది. కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి అందరికీ జీవిత ఖైద్ శిక్ష తో పాటు , ఒక్కొక్కరికి ఇరవై వెల జరిమానా విధించారు.
అలాగే మైనర్ బాలికకు పన్నెండు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మహిళలు మరియు విద్యార్థినులు తమపై జరిగే వేధింపులు, అన్యాయాల గురించి నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.ఈ కేస్ లో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పి. పి రామకృష్ణారావు తో పాటు పోలీస్ సిబ్బంది కి ఎస్పీ అభినందనలు తెలిపారు.






