16 July, 2026 | 1:07 AM

పీజీ కళాశాల ప్రిన్సిపాల్ అరెస్టు

16-07-2026 12:55 AM

కొల్లాపూర్ రూరల్, జూలై 15: కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియాస్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పీజీ చదువు పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే తన గదికి రావాలని ఒత్తిడి చేసి, మానసికంగా, శారీరకంగా వేధించాడని జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో నాగర్ కర్నూల్ జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.