టీ లాంటి సంస్థ ఏర్పాటు చేయండి
18-08-2026 01:07 AM
మంత్రి శ్రీధర్‌బాబుకు న్యూఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన, అద్భుతమైన పనితీరును కనబరుస్తున్న టీ వర్క్స్ లాంటి సంస్థను న్యూఢిల్లీలో కూడా ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా కోరారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ సందర్శించిన మంజిందర్ సింగ్ తెలంగాణ సచివాలయంలో సోమ వారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు, మంజిందర్ సింగ్ పలు అంశాలపై చర్చించారు.






