పేదల పథకాలు ఆపొద్దు..
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతల రాస్తారోకో
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా పథకాలు కొనసాగించాలని డిమాండ్
రామారెడ్డి, ఆగస్టు 17 (విజయ క్రాంతి) :కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు మెమోరండం సమర్పించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను ప్రభు త్వం కొనసాగించాలని,
అర్హులైన ప్రతి కుటు ంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనం అం దేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి, నారాయణ రెడ్డి, పోతునూరి ప్రసాద్, పడిగేల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ సుద్దాల లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రద్దు ప్రయత్నాలు విరమించుకోవాలి
భిక్కనూర్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ భిక్కనూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజావాణిలో ఎంపీడీవో సవిత, తహసీల్దార్ సునీతకు బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆ పథకాలను రద్దు చేయొద్దు
దోమకొండ, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ దోమకొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపటారు. ఎంపడీవో కార్యాలయంలో ఎమ్మార్వో, ఎంపీడీవోలకు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కుట్రను అడ్డుకోవాలి
నాగిరెడ్డిపేట్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై మండల అధ్యక్షులు గుర్రాల సిద్ద య్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దయ్య, నాయకులు మాట్లాడు తూ.. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయుటకు కుట్ర పండుతున్నందున అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి, సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, సాయిలు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన
నసురుల్లాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, సాయిలు, శంకర్, రమేష్ , లక్ష్మణ్, కృష్ణ రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే దిగ్బంధం
కామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివే స్తుందని బిఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ లో ఎల్లారెడ్డి నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమానికి పిలుపు నివ్వడంతో కామారెడ్డికి వచ్చిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
బయటకు వెళ్ల నియమని పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దిన్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదానీకి దిగారు.
పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ నేతలు తరలి రావడంతో పోలీసుల కు బి బిఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను బయటకు రావాలని తోసుకుంటూ బిఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ తో పాటు బి ఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ హోటల్ వద్ద పాత ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
పోలీసుల తీరును బిఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ తనను అడ్డుకోవడం రాజకీయ కక్ష మాత్రమేనని అన్నారు. ఎక్కడ అడ్డుకోకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గ లోనే అడ్డుకోవడం చూస్తుంటే ఎమ్మెల్యే పోలీసులతో నిర్బంధం చేయిస్తున్నట్లుందన్నారు. పోరాటాలు తమకు కొత్త కాదని అన్నారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో కామారెడ్డి నియోజకవర్గం టిఆర్‌ఎస్ నాయకుల లు చేపట్టిన ధర్నా లో పాల్గొన్నారు.
చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి
కామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే గద్దె దిగాలి కానీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కుట్రలు చేయవద్దని బి ఆర్ ఎస్ నాయకులు సోమవారం కామారెడ్డి నిజాంసారు చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా పై బైఠాయించి నినాదాలు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం తగదన్నారు.
చేతకాక పోతే పెద్ద దిగాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను కొనసాగించకుంటే బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు కుంభాల రవి యాదవ్, ఆరకల ప్రభాకర్ యాదవ్, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బలవంతరావు, మహిళా అధ్యక్షురాలు సుమిత్రానంద్, కామారెడ్డి నియోజకవర్గం టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






