పొరపాటు
22 ఏపై అధికారుల తప్పిదం
నేను క్షమాపణ కోరుతున్నా
- ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు ఆస్తులకూ రక్షణ
- నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ
- దరఖాస్తులకు 15 రోజుల్లో పరిష్కారం
- రిజిస్ట్రేషన్లు జాప్యం కాకుండా అదనపు స్లాట్లు
- భూముల సమాచారానికి టోల్ ఫ్రీ నంబర్
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): నిషేధిత భూముల జాబితాల్లో పొరపాట్ల వల్ల అసలైన యజమానులకు అన్యాయం జరిగిందని, సామా న్యులు కూడా ఇబ్బంది పడ్డారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గతంలో హైకో ర్టు ఆదేశాల మేరకు అధికారులు నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూ ముల వివరాలను వదిలేశారని, ఫలితంగా అవి ఇప్పటికీ నిషేధిత జాబితా లో ఉండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
అధికారులు చేసిన పొర పాటుకు తను క్షమాపణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుదని స్పష్టంచేశారు. 22 ఏ భూములపై సోమవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సం గారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నిషేధిత భూముల పేరి ట అసలైన యజమానులకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. 22 ఏ నిషేదిత భూముల సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేశామని, ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై దరఖాస్తులు, ఇతర సమస్యలపై సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా 757 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాలో 511 దరఖాస్తులు, రంగారెడ్డి 146, హైదరాబాద్ 49, సంగారెడ్డి - 38 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
మేడ్చల్ జిల్లా నుంచి వచ్చిన 511 దరఖాస్తుల్లో 320 అర్బన్ ల్యాండ్ సీలింగ్ రకానికి చెందినవని, వీటితో పాటు మిగిలిన జిల్లాల్లో 22ఏ దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైతే స్లాట్ బుకింగ్‌ల సం ఖ్య పెంచి వెంటనే రిజిస్ట్రిషన్లు జరిగేలా చూ స్తామన్నారు. నిషేధిత భూముల సమాచారానికి టోల్‌ఫ్రీ నెంబర్ 1800 5994788 ఏర్పాటు చేశామని, ఎవరు దీనికి సమాచా రం పంపినా కనీసం 3 రోజల్లో సమాధానం అందుతుందన్నారు.
రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని కేసుల్లో కారణాలను ప్రజలకు చెప్పాలని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్ల యితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని భూదాన్ భూములు, వాటికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, వివాదాలు, పరిష్కార మార్గాలపై సమగ్ర నివేదిక రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ప్రైవేటు ఆస్తులకూ భద్రత
ప్రభుత్వ భూములను కాపాడుతూనే ప్రై వేటు ఆస్తులకు భద్రత కల్పిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. యుఎల్సీ జాబితాను సరిచేస్తున్నామని, అసలైన హక్కుదారులకు న్యాయం చేస్తూ మరో రెండు రోజుల్లో తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొన్ని చోట్ల భూ సేకరణ చేస్తే.. పూర్తి సర్వే నంబరును బ్లాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. ఉదాహారణకు రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమి.
అందులో యజమాని రెండెకరాలను మాత్రమే భూదానం ఇచ్చా రు. ఐతే ఆ రెండు ఎకరాలు ఎక్కడో తెలియదు. దాంతో మొత్తం 12 ఎకరాలను బ్లాక్ చేశారు. ఇప్పుడు అధికారులు ఒకటీ రెండు రోజుల్లో ఆ రెండు ఎకరాలకు కో ఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తారని, మిగతా 10 ఎకరాలను పీవోబీ నుంచి తొలగిస్తారన్నారు. ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే దేవాదాయ, వక్ఫ్, ఫారెస్టు భూముల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నారు.
జియో ట్యాగింగ్ ద్వారా అసలు స్ధలాలకు రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన భూములను ఫ్రీహోల్ చేయాలని’ ఆదేశించామని మం త్రి తెలిపారు. సిఎస్ -7, సిఎస్ -14కు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా కోర్టు కేసుల్లో మగ్గుతున్నాయన్నారు. ఒకవైపు కోర్టులో హియరింగ్స్ నడుస్తుండగానే కొన్ని చోట్ల రెగ్యలరైజేషన్ జరిగిందని, కొన్ని పీవోబీలో నమోదు చేశారని, వీటన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కేసు సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్‌లో ఉందని, ఆ తీర్పుకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందన్నారు.
అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 నుంచి 38 వేల ల్యాండ్ పార్శిళ్లు పీవోబీలో చేరాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా ఆల్విన్ కాల నీ, ఆస్బెస్టాస్ కాలనీ, నారపల్లి వంటి ప్రాం తాల్లో తలెత్తిన సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తాను కూ డా జిల్లాల్లో పర్యటించడంతో పాటు ఆస్తులను కాపాడేందుకు 360 కోణంలో చూస్తా మన్నారు.
ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటే చర్యలే..
22 ఏ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారం ఎవరికీ లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం, చిన్న సమస్యను పెద్ద స మస్యగా మార్చడం ఇకపై సహించేది లేదు. ప్రజల సమస్యను పరిష్కరించడం అధికారులుగా మీ బాధ్యత అన్నారు. నిజమైన భూ హక్కుదారుడికి న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి.
ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని నిర్లక్ష్యం చేసి నా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నా రు. 22 ఏ లో భూమి ఉందనే ఒక్క కారణం తో ప్రజలను తిరస్కరించకూడదు. ఆ భూ మి ఎందుకు నిషేధిత జాబితాలోకి వచ్చింది, సంబంధిత రికార్డులు ఏమి చెబుతున్నా యో, వాస్తవ పరిస్థితి ఏమిటో సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.






