కమల దళంలోకి కొత్తనీరు
- బీజేపీ జాతీయ స్థాయి పదవుల ప్రకటన
- కూర్పులో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్క్
- ఉత్తరాది, దక్షిణాది, నార్త్ ఈస్ట్ నుంచి సమతుల్యత
- సీనియర్లతోపాటు యువ నేతలకూ ప్రాధాన్యం
- 13 మందికి ఉపాధ్యక్ష పదవులు
- మహిళ ప్రాతినిధ్యానికి పెద్దపీట
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. వివిధ రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు చేశారు. యువతకు సీనియర్లకు మధ్య సమతుల్యత పాటిస్తూ, మహిళలకు ప్రాతినిధ్యమిస్తూ పదవులను కేటాయించారు. అట్టడుగు స్థాయిలో అనుభవం ఉన్న నేతలకు పెద్దపీట వేశారు. మొత్తం 13 మందిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రకటించారు. తన టీంలో మహిళలకు పెద్దపీట వేశారు. ఆరుగురు మహిళా నేతలను ఉపాధ్యక్షులుగా, ముగ్గురిని కార్యదర్శులుగా, ఒకరిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
13 మంది ఉపాధ్యక్షులు వీరే
ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, రాం మాధవ్, రాజస్థాన్ నుంచి వసుంధర రాజే సింధియా, ఉత్తరాఖండ్ నుంచి తీరథ్ సింగ్ రావత్, ఒడిశా నుంచి బైజయంత్ జయ్ పాండా, గుజరాత్ నుంచి రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషీ, మహారాష్ట్ర నుంచి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, పంజాబ్ నుంచి సర్దార్ మన్‌ప్రీత్ సింగ్‌బాదల్, మధ్యప్రదేశ్ నుంచి లాల్ సింగ్ ఆర్య, కర్ణాటక నుంచి ప్రొఫెసర్ ఎం.నాగరాజా, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్, బంగాల్ నుంచి డాక్టర్ మధుచంద్ర కర్ ఉపాధ్యక్ష పదవులు దక్కించుకున్నారు. అలాగే, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు.
ప్రధాన కార్యదర్శి, సంయుక్త ప్రధాన కార్యదర్శులు
పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత): బీఎల్ సంతోష్ (ఢిల్లీ)
సంయుక్త ప్రధాన కార్యదర్శులు: శివ్‌ప్రకాశ్ (మహారాష్ట్ర), సౌదన్ సింగ్ (పంజాబ్)
ప్రధాన కార్యదర్శులు వీరే వినోద్ తావ్డే (మహారాష్ట్ర), సునీల్ బన్సాల్ (ఢిల్లీ), బిప్లవ్ కుమార్ దేబ్ (త్రిపుర), స్మృతి ఇరానీ (ఉత్తర్‌ప్రదేశ్), డాక్టర్ సతీష్ పూనియా (రాజస్థాన్), గజేంద్ర పటేల్ (మధ్యప్రదేశ్), హరీష్ ద్వివేది (ఉత్తరప్రదేశ్), సంజయ్ భాటియా (హర్యానా)
కార్యదర్శులు
కవిత పటిదార్ (మధ్యప్రదేశ్), సురేంద్రన్ (కేరళం), డాక్టర్ భోలా సింగ్ (ఉత్తర్‌ప్రదేశ్), డా ప్రదీప్ వర్మ (జార్ఖండ్), జగదీశ్ ఈశ్వర్‌భాయ్ పటేల్ (గుజరాత్), డాక్టర్ సందీప్ పాఠక్ (ఢిల్లీ), ఫాంగ్నాన్ కొన్యాక్ (నాగాలాండ్), సంగీత యాదవ్ (ఉత్తర్‌ప్రదేశ్), అనిల్ ఆంటోనీ (కేరళం), డా ఎం.వెంకటేశన్ (తమిళనాడు), మనోజ్ తిగ్గ (పశ్చిమ బంగాల్), సిద్ధార్థ్ శంభు (బీహార్), డాక్టర్ స్వదేశ్ సింగ్ (ఢిల్లీ), మృగంకా దేవ్ బర్మన్ (అసోం), రోహన్ గుప్తా (గుజరాత్), జయప్రకాశ్ (ఢిల్లీ)
ఇతర పదవుల కేటాయింపు
కోశాధికారి: పీయూష్ గోయల్ (మహారాష్ట్ర)
సంయుక్త కోశాధికారి: రాజేశ్ మంగల్ (రాజస్థాన్)
సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జ్: తరుణ్ చుగ్ (పంజాబ్)
సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శి : మహేంద్ర పాండే (ఉత్తరాఖండ్)
నార్త్ ఈస్ట్ కో డా.సంబిత్ పాత్రా (ఒడిశా)
నార్త్ ఈస్ట్ సంయుక్త కో రాజీవ్ బబ్బర్ (ఢిల్లీ)
ఆల్ సెల్స్ కో ఆర్డినేటర్: విష్ణుదత్ శర్మ (మధ్యప్రదేశ్)
ఆల్ సెల్స్ జాయింట్ కో రితురాజ్ సిన్హా (బిహార్), విష్ణువర్ధన్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్)
అమిత్ ఔట్.. దీపక్ మాస్కే ఇన్
బీజేపీ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్‌గా అమిత్ మాలవీయను తప్పించి, జాతీయ అధ్యక్షుడు నితిన్ ఆ స్థానంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మాస్కేను నియమించారు. మాలవీయ ఆ పదవిలో పదేళ్ల నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన బంగాల్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మాలవీయ పార్టీ కో- ఇన్‌ఛార్జిగా వ్యవహరించి, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీ సోషల్‌మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రతువులో భాగంగా, అధిష్ఠానంగా తాజాగా దీపక్ మాస్కేకు ఆ బాధ్యతలు అప్పగించింది.
వృత్తి రీత్యా దీపక్ ప్రొఫెసర్. ఎన్నికల డేటా, ప్రభుత్వ పథకాల విశ్లేషకుడిగా ఆయనకు గుర్తిం పు ఉంది. గతంలో ఈయన ఛత్తీస్‌గఢ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సేవలందించారు. 2009లో ఆయన బీజేపీలో చేరారు. పార్టీ ఛత్తీస్‌గఢ్ అధికార ప్రతినిధిగా ఏళ్ల పాటు సేవలందించారు. తాజాగా ఆయనకు పార్టీలో కీలక పదవి లభించింది.
మోర్చా విభాగాల అధ్యక్షులు వీరే..
యువ మోర్చా: డాక్టర్ హేమాంగ్ జోషి (గుజరాత్)
మహిళా మోర్చా: రూప్ కుమారి చౌధరి (ఛత్తీస్‌గఢ్)
ఓబీసీ మోర్చా : అమర్‌పాల్ మౌర్య (ఉత్తర్‌ప్రదేశ్)
కిసాన్ మోర్చా: బన్సిలాల్ గుర్జర్ (మధ్యప్రదేశ్)
ఎస్సీ మోర్చా: శివేష్‌కుమార్ రామ్ (బీహార్)
ఎస్టీ మోర్చా : డాక్టర్ మన్నాలాల్ రావత్ (రాజస్థాన్)
మైనార్టీ మోర్చా: కున్వర్ బాసిత్ అలీ (ఉత్తరప్రదేశ్)
మీడియా కన్వీనర్: అనిల్ బలూనీ (ఉత్తరాఖండ్)
మీడియా కో కన్వీనర్లు: ఆశీష్ ఉషా అగర్వాల్ (మధ్యప్రదేశ్), ప్రదీప్ భండారి (ఢిల్లీ), సిద్ధార్థ్ యాదవ్ (ఢిల్లీ)
సోషల్ మీడియా కన్వీనర్: దీపక్ మస్కే (ఛత్తీస్‌గఢ్)
సోషల్ మీడియా కో ప్రీతిగాంధీ (మహారాష్ట్ర), శివానంద్ ద్వివేది (ఢిల్లీ), అలోక్ భట్ (ఉత్తరాఖండ్), అరుణ్ యాదవ్ (హర్యానా)






