కరీంనగర్‌లో కదంతొక్కిన పాడి రైతులు
- డెయిరీని కాపాడాలంటూ కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ, ధర్నా
- కరీంనగర్ డెయిరీ భూములను తిరిగి అప్పగించాలి
- భూ భారతి పోర్టల్‌లో డెయిరీ భూములుగా నమోదు చేయాలని డిమాండ్
- డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
- ఇంత జరుగుతున్నా స్పందించని మంత్రి పొన్నం
ముకరంపుర/కరీంనగర్ క్రైం, ఆగస్టు 17 (విజయక్రాంతి): ధరణి పోర్టల్ స్థానంలో తెచ్చిన భూ భారతి పోర్టల్‌లో కరీంనగర్ డెయిరీ భూమిని తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ పేరుకు బదలాయించడంతో పాడి రైతులు సోమవారం కరీంనగర్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. డెయిరీ చైర్మన్ డాక్టర్ చెల్మడ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో వేలాది మందితో డెయిరీని కాపాడాలనే నినాదాలతో భారీ ర్యాలీ కొనసాగింది.
2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రతి పాడిరైతుకు 50% సబ్సిడీ పై 2 పాడి గెడలను ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ధర్నా అనంతరం చైర్మన్ ఆధ్వర్యంలో డెయిరీ ప్రతినిధులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడు తూ.. కరీంనగర్ డెయిరీ భూములను ధరణి పోర్టల్ నుంచి తొలగించి తెలంగాణ ఫెడరేషన్ పేరు మీదకి మార్చుకున్నారని ఆరోపించారు.
ప్రభు త్వం తక్షణమే స్పందించి కరీంనగర్ డెయిరీకి సంబంధించిన భూములను డెయిరీ పేరు మీద తిరిగి అ ప్పగించాలని డిమాండ్ చేశారు. డెయిరీని నమ్ముకొని లక్షల మంది పాడి రైతుల కుటుం బాలు బతుకుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డెయిరీ పాలను వాడాలని ప్రభుత్వాన్ని కోరారు. పాడి రైతులకు పాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లక్ష కుటుంబాలను వీధిల పాలు చేయకుండా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా కరీంనగర్ డెయిరీ భూములు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధరణిలో కరీంనగర్ డెయిరీ పేరు మీద ఉండగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతిలో మాత్రం తెలంగాణ ఫెడరేషన్ పేరుమీద మార్చారని, దీనికి కారణం గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అని పాడి రైతులు భావిస్తున్నారు. విమర్శలు వస్తున్నా ఏమాత్రం స్పం దించకపోవడంపై వారిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నోటీసు ఇవ్వకుండానే మార్చుకున్నారు: డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు
కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు మా ట్లాడుతూ.. ‘నోటీసు ఇవ్వకుండానే భూభారతిలో కరీంనగర్ డెయిరీకి సంబంధించిన భూ ములను ధరణి నుంచి ఫెడరేషన్ పేరు మీదకు మార్చుకున్నారు. ఆకస్మాత్తుగా ఆగస్టు 3న మ మ్మల్ని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. కరీంనగర్ డెయి రీ నుంచి దేవాలయాలకు నెయ్యి, ప్రభుత్వ పాఠశాలలకు పాలు సరఫరా చేసేవారం. మాకంటే ఎక్కువ కోడ్ చేసిన ఫెడరేషన్‌కు సరఫరా ఆర్డర్ ఇచ్చి మా సరఫరా క్యాన్సల్ చేశారు.
కెఎంపిసిఎల్ రైతులది, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మాది పాల పార్ట్ రైతులు వారి కార్యాచరణ వా రు చేస్తున్నారు. కలెక్టర్ కూడా వినతిపత్రంపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 22వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పా రు. ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై మా తదుపరి కార్యాచరణ ఉంటుంది’ అని వెల్లడించారు.






