18 August, 2026 | 2:37 AM

బీసీలకు కాంగ్రెస్ ద్రోహం

18-08-2026 01:31 AM
  1. ముస్లిం రిజర్వేషన్లతో అన్యాయం 
  2. రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు
  3. కాంగ్రెస్‌ది ఓబీసీ వ్యతిరేక వైఖరి 
  4.  డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి): ‘కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారిని బీసీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడంతో, బీసీలకు దక్కాల్సిన అవకాశాలు తగ్గిపోయాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బీసీలకు రిజర్వ్ చేసిన పలు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దీనిపై బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్.రామచందర్‌రావు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మా ట్లాడుతూ లక్ష్మణ్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చాకు ప్రాధాన్యం పెరిగిందన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీ బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుందని విమర్శించారు.

ముస్లింలలో కొన్ని వర్గాలను బీసీల్లో చేర్చడం వల్ల, అనేక ప్రాంతాల్లో ఎంఐఎంకు చెందిన వ్యక్తులు, ఆయా వర్గాలకు చెందిన ము స్లింలు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారని పేర్కొన్నారు. దీని వల్ల బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై ప్రభావం పడుతుందన్నారు. కేవలం ఓట్ల కోసం కొందరు రాజకీ య నాయకులు మైనార్టీలను బుజ్జగించే రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నా రు.

బీఆర్‌ఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఒక కుటుంబానికి న్యాయం చేసే పార్టీగా అభివర్ణించారని, అది నిజమేనని.. కానీ కాంగ్రెస్ మాత్రం సోదరులకు న్యాయం చేసే పార్టీ అని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజమైన న్యాయం చేసే పార్టీ ఏదై నా ఉందంటే, అది ఒక్క బీజేపీయేనన్నారు. కొన్ని పార్టీలు ఒక కుటుంబం లేదా కుటుంబంలోని కొద్దిమంది కోసం పని చేయవచ్చే మో కానీ,  బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. పాలన విషయంలో బీజేపీకి, ఇతర పార్టీలకు తేడా ఇదేనని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ది రాజకీయ లబ్ధి: ఎంపీ లక్ష్మణ్ 

కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు వ్యతిరేకి అని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ నిరంతరం బీసీల కు ద్రోహం చేస్తూ, ఇప్పుడు వారి సంక్షేమం కోసం కన్నీరు కారుస్తున్నట్లు నటిస్తుందన్నా రు. వెనుకబడిన వర్గాల కోసం ప్రధాని నరేం ద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాం గ హోదా కల్పించారని లక్ష్మణ్ గుర్తు చేశారు.