15 June, 2026 | 4:54 AM

మానవ సేవే మాధవ సేవ: తుమ్మల యుగంధర్

15-06-2026 12:10 AM

ఖమ్మం టౌన్, జూన్ 14 (విజయక్రాంతి): మాధవ సేవే మాధవ సేవ అని, అందునా రోగులకు చేసే సేవ ఎంతో గొప్పదని కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ అన్నారు. ఆదివారం కొంగర.రాధాక్రిష్ణ గవర్నమెంట్ హాస్పిటల్కుకు 130 ట్యూబ్ లైట్స్ 30 ఫ్యాన్లను తుమ్మల.యుగంధర్ చేతుల మీదుగా హాస్పటల్ డిప్యూటి సూపరిండెంట్ కిరణ్ కుమార్‌కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ కిరణ్ కుమార్ ని అభినందించారు.  ఈ కార్యక్రమంలో దొబ్బల.సురేష్, చండ్ర.శశి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, రావూరి.సైదు బాబు, ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.