15 June, 2026 | 3:58 AM

రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీరు

15-06-2026 12:11 AM

తూప్రాన్, జూన్ 14: తూప్రాన్ మున్సిపాలిటీ 12వ వార్డు మహంకాళి వెనుక కాలనీలో డ్రైనేజి నీరు లీకేజీ అయ్యి రోడ్డుపై పారుతుండడంతో గల్లివాసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12వ వార్డులో కొన్ని ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలంలో పాములు, తేళ్ళ మధ్య బతకాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు. 12వ వార్డు ప్రజా ప్రతినిధితో పాటు, మున్సిపల్ కమిషనర్ స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.