15 June, 2026 | 3:39 AM

యువత క్రీడల్లో రాణించాలి

15-06-2026 12:10 AM

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ పంపిణీ 

కొల్చారం, జూన్ 14: యువత ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడల్లో రాణించాలని బిఆర్‌ఎస్ యువజన విభాగం మండల శాఖ అధ్యక్షులు సంతోష్ రావు అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో ముత్యం ప్రవీణ్ జ్ఞాపకార్థం ఆయన మిత్రుడు చౌరి గారి భాస్కర్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో క్రీడాకారులకు నగదు బహుమతులను సంతోష్ రావు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడల్లో చదువులో రాణించాలన్నారు. ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు శ్యామ్ రావు, దుర్గాప్రసాద్ గౌడ్, కృష్ణ, వనమాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.