9 May, 2026 | 2:14 PM

Breaking News

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •  

తొలి విడతలో 41,285 మందికి సీట్లు

11-06-2025 12:00 AM
  1. 13న ఫేజ్-2 సీట్ల కేటాయింపు
  2. ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్లు 
  3. జూన్ 30 నుంచి తరగతులు 
  4. వెల్లడించిన అధికారులు

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): దోస్త్ మొదటి విడతలో 60,428 సీట్లను కేటాయిస్తే  కాలేజీల్లో చేరింది మాత్రం 41,285 మంది విద్యార్థులే. దాదాపు 20 వేల మంది విద్యార్థులు జాయిన్ కాకపోవడం గమనార్హం. తొలి విడుతలో మంచి కాలేజీల్లో సీట్లు లభించని కారణంగానే విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరలేదని అధికారులు తెలిపారు. వీరంతా రెండో విడతలో పాల్గొననున్నారు.

ఈనెల 13న దోస్త్ ఫేజ్-2 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. ఫేజ్-2కు 35,954 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఫీజు చెల్లించినవారు 33,409 మంది ఉన్నారు. దరఖాస్తులు నింపినవారు మాత్రం 34, 276 మంది కాగా, వెబ్ ఆప్షన్లు 46,886 ఇచ్చుకున్నారు. సీట్ల కేటాయింపు తర్వాత స్పాట్ అడ్మిషన్లు చేపడుతామని అధికారులు తెలిపారు. జూన్ 30 నుంచి తరగతులు ప్రారం భమవుతాయని వెల్లడించారు.