2 May, 2026 | 5:28 PM

మహబూబాబాద్ జిల్లా డీఈవోగా సత్యనారాయణమూర్తి నియామకం

02-05-2026 04:09 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నూతన విద్యాధికారిగా సత్యనారాయణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఈవోగా పనిచేసిన రాజేశ్వర్ ఖమ్మం జిల్లాకు బదిలీ అయినప్పటికీ ఇన్చార్జి డిఈఓ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ మూర్తిని పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఈవోగా నియమించారు. జిల్లా కలెక్టర్ గా ఇటీవల బదిలీపై వచ్చిన స్నేహ శబరిష్ విద్యా వ్యవస్థ గాడిలో పెట్టడానికి అనేక చర్యలు చేపట్టారు.

గురుకులాలు, కేజీబీవీల పనితీరు, విద్యాలయాల సక్రమ నిర్వహణ తదితరా అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లావ్యాప్తంగా కలెక్టర్ ముమ్మరంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో అవినీతికి పాల్పడుతూ ఇద్దరు ఉపాధ్యాయులు ఏసీబీ అధికారులకు పట్టుబడడం తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లా విద్యాశాఖలో పెరిగిపోయిన అవినీతికి పరాకాష్టగా ఆ సంఘటన నిలుస్తోంది. ఈ క్రమంలో నూతనంగా డీఈవోగా సత్యనారాయణమూర్తి నియమితులు కావడం, ఇప్పుడైనా విద్యా వ్యవస్థను సరైన గాడిలో పెట్టే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.