7 May, 2026 | 12:46 AM

రాయినిగూడెం పీఏసీఎస్ చైర్మన్‌గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

07-05-2026 12:02 AM

గరిడేపల్లి, మే 6 :  మాజీ పిఎసిఎస్ చైర్మన్, పాలకవర్గాన్ని కొనసాగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాయినిగూడెం ప్రాథమిక సహాయ సహకార సంఘం చైర్మన్ జుట్టుకొండసత్యనారాయణ, పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు అయ్యే విధంగా కృషి చేస్తానన్నారు.

రైతులకు అందించే విత్తనాలు ఎరువుల విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అందిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు బాల్దూరి అంజయ్య, దాసరి నర్సమ్మ, బొల్లెపల్లి రామనాథం, జాల వీరస్వామి, కడప రజిత, ముప్పారపు రామయ్య, పెమగాని వెంకటేశ్వర్లు, మానవ సైదులు, మంగళగిరి కృష్ణ, పోటు నాగేశ్వరరావు, కామల్ల సుకన్య, సీఈఓ కనకయ్య, సిబ్బంది దొంగరి శ్రీనివాస్, పాలేల్లి అంజయ్య, నకరకంటి సాయిలు, కాట్రేవుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.