ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్‌గా గంప వెంకటేష్
07-05-2026 12:00 AM
ఆమనగల్లు, మే6, (విజయ క్రాంతి): ఆమనగల్లు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా గంప వెంకటేష్ గుప్తా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు డీసీవో కార్యాలయం అసిస్టెంట్ రిజిస్టార్ ఆంజనేయులు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. రైతులకు పంట రుణాలు, వరి కొనుగోలు సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యదర్శి పద్మాకర్ రెడ్డి,అల్లాజీ, దేవేందర్ పాల్గొన్నారు.






