7 May, 2026 | 12:45 AM

స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి

07-05-2026 12:03 AM

సూర్యాపేట, మే 6 (విజయక్రాంతి) :  జనగణనలో భాగంగా చేపడుతున్న స్వీయ గణన గడువు ఈ నెల 10న ముగుస్తున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకుని ఈ బృహత్ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. స్వీయ గణన గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ  జిల్లా కేంద్రంలో బుధవారం మారథాన్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా, ఖచ్చితత్వంతో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రతి కుటుంబం తమ వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా ,  ఆర్డీవో ఆర్. వేణు మాధవరావు, సిపివో ఎల్. కిషన్, సూర్యాపేట, సెన్సస్ జిల్లా ఇన్చార్జి ఇస్లావత్ హోబాలాల్,  డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెండెం వెంకట్ రమణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. హనుమంత రెడ్డి, సూర్యాపేట, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది,మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.