10 May, 2026 | 2:38 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది

27-12-2025 03:45 PM

మన ఊరి లోని విద్యార్థులు మన పాఠశాలలోనే చదివించాలి

ప్రభుత్వ పాఠశాలలో సీతంపేట సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణి సదానందం

ముత్తారం,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, మన ఊరిలోని విద్యార్థులు మన పాఠశాలలోనే తల్లిదండ్రులు చదివించాలని సీతంపేట సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణి సదానందం అన్నారు. శనివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థి మన ప్రభుత్వ పాఠశాలలోని చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉచిత భోజనం పుస్తకాలు ఉచిత విద్య బోధన అందుతున్నాయని, దీంతో పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఇకనుంచి తల్లిదండ్రులు ఆలోచించి ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదివేల కృషి చేయాలని కోరారు. ఆమె వెంట గ్రామ మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్, పాఠశాల  ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.