మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు
25-04-2026 05:01 PM
కూసుమంచి,(విజయ క్రాంతి): కూసుమంచి మండలం, లోక్య తండ సర్పంచ్ వడిత్య వెంకటేష్ నాయక్ జన్మదిన వేడుకలు రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి వెంకటేష్ నాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు. గ్రామాభివృద్ధి పట్ల ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం నాయకులు, సర్పంచులు, పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.






