25 July, 2026 | 2:27 AM

పేపర్ లీక్ చేస్తే.. 10 @ ఏళ్ళ జైలు

25-07-2026 01:21 AM

నెల రోజుల్లో ఎన్టీఏ ప్రక్షాళన 

  1. దోషులకు రూ.10 కోట్ల జరిమానా 
  2. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మూడు నెలల్లో కేసుల విచారణ పూరి 
  3. ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం 
  4.   2024 ప్రవేశ పరీక్షల చట్టానికి కీలక సవరణలు 

న్యూఢిల్లీ, జూలై 24: పేపర్ లీకులకు పాల్పడే వారికి పదేళ్ల జైలుశిక్ష, దోషులకు రూ.10కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును శుక్రవారం కేంద్రక్యాబినెట్ ఆమోదించింది. ఇలాంటి కేసుల విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి, శిక్ష వేయనున్నారు.  ఈ మేరకు ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి సవరణలు చేస్తూ సోమవారమే బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు, నెల రోజుల్లో ఎన్టీఏ ప్రక్షాళన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్టీఏలో ౪౭ మందిపై వేటు వేస్తూ.. వారిపై లీగల్, క్రిమినల్ కేసులు పెట్టేవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. లీకులకు ఆస్కారం లేకుండా ఎన్టీఏలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని మార్చాలని కేంద్రం నిర్ణయించింది.  ఎన్టీఏలో- 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి కీలక సవరణలు చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

ప్రశ్నపత్రాల లీక్‌ల ఘటనలో దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకు 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి కేంద్రం కీలక సవరణలు చేసి నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5--10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది.

ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నారు. ఇందు కు సంబంధించిన ప్రతిపాదనలపై  జరిగిన క్యాబినెట్ భేటీలో చర్చలు జరిపారు. అనంతరం ఈ ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. ఇక, పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తా మని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ న్యాయస్థానంలో తొలి ఫా స్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటవ్వగా.. మరో నాలుగింటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

ఈ న్యాయస్థానాల పరిధిలో.. పేపర్ లీకులకు కేసుల విచారణను మూడు నెలల్లో పూర్తిచేసి, దోషులకు శిక్ష విధించేలా బిల్లులో ప్రతి పాదనలు చేసినట్లు సమాచారం. నీట్ పేపర్ లీకు వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన ఉదృతమైన నేపథ్యంలో కేం ద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది. లీకేజీ ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని స్వయంగా ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని తెలిపారు.