పోలీసులు నాణ్యమైన దర్యాప్తు జరపాలి
దోషులకు కోర్టులో శిక్ష పడాలి
సుప్రీంకోర్టు న్యాయవాది పీయూష్ రాజ్
టీఎస్‌పీఏలో ఏడు కీలక అంశాలపై శిక్షణ డీఎస్పీలకు అవగాహన
రాజేంద్ర నగర్ జూలై 24 (విజయక్రాంతి): నేరాలపై పోలీస్ శాఖ తరపున నాణ్యమైన దర్యాప్తు జరిగినప్పుడే కోర్టు లో దోషులకు శిక్షలు పడుతాయని సుప్రీంకోర్టు న్యాయవాది పీయూష్ రాజ్ తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డిఎస్పి లకు ‘అత్యుత్తమ దర్యాప్తు చేసినప్పటికీ కూడా కోర్టులో ఎందుకు విఫలం అవుతుంది .. దర్యాప్తు నాణ్యత ప్రమాణాలు‘ అనే అంశంపై శుక్ర వారం సుప్రీంకోర్టు న్యాయవాది పీయూష్ రాజ్ అవగాహన కల్పించారు.
ముఖ్యంగా దర్యాప్తులో అనుసరించే ఏడు అంశాలపై శిక్షణ పొందుతున్న డీఎస్పీలకు పలు సూచనలు చేశారు . రాష్ట్రం లో 285 సబ్ ఇన్స్పెక్టర్ అంతకంటే పై స్థాయి పోలీసు అధికారులకు ప్రత్యేక వేబి నార్ నిర్వహించారు దర్యాప్తు సక్రమంగా జరిగినప్పటికీ కోర్టులో కేసులు బలహీన పడటానికి గల 7 కారణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ వేమా శ్రీనివాసరెడ్డి, డి ఎస్ పి లు సతీష్ కుమార్, పి జీ రెడ్డి, ఆదూరి శ్రీనివాసరావు, దేవారెడ్డీ లు పాల్గొన్నారు.






