మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం
25-04-2026 04:58 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో సీసీ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. శనివారం నాడు మండలంలోని గండివేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి 10 లక్షల నిధులు ఎల్లారెడి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కేటాయించడంతో గాంధారి ఏఎంసీ చైర్మన్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్ మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష సంతోష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పిట్ల సాయిబాబా , కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






