13 April, 2026 | 9:53 PM

శివంపేట్ లో (అరైవ్ అలైవ్ ) రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

13-04-2026 08:10 PM

 ఎస్ఐ మధుకర్ రెడ్డి

శివంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో,ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఎస్సై మధుకర్ రెడ్డి,వారి భాగస్వామ్యంతో గ్రామసభ నిర్వహించి  ఆరైవ్ అలైవ్ ప్రజలకు అవగహన కలిపించి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని లైసెన్స్ లేనిది ఎవరు వెహికల్స్ నడపవద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా ఎవరు వెహికల్స్ నడపవద్దని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.