13 April, 2026 | 9:22 PM

ఆరు ఇండ్లలో భారీ చోరీ

13-04-2026 08:13 PM

భారీగా బంగారం నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో ఘటన

కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. నాచుపల్లి గ్రామంలోని ఆరు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ పనుల నిమిత్తం బయట గ్రామాలకు వెళ్లిన కుటుంబాల ఇళ్లను గుర్తించిన దుండగులు, అర్ధరాత్రి సమయంలో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఎవరూ లేనిది ఆసరా తీసుకుని నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.