13 April, 2026 | 9:33 PM

మరిమడ్లలో ముదిరాజ్ సంఘానికి చేపల వలల పంపిణీ

13-04-2026 08:05 PM

కోనరావుపేట(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యులకు మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ చేపల వలలను పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవనోపాధికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో స్వంత ఖర్చుతో కొనుగోలు చేసిన వలలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొల స్వాతి, స్థానిక నాయకులు మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడిన వారికి ఇలాంటి సహాయం ఎంతో అవసరమని, శ్రీకుమార్ చేసిన సేవ అభినందనీయమని అన్నారు. తమ విన్నపాన్ని వెంటనే స్పందించి వలలను అందజేసినందుకు ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుమ్మరి దిలీప్ కుమార్,బొల్లం శ్రీనివాస్, మాట్ల అశోక్, జిన్నా రవి,ఇండ్ల సత్తయ్య,శంకరయ్య, బాబు,రాజమల్లేశం, రామచంద్రం,భాస్కర్,అనొక్ గ్రామ పెద్దలు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.