1 June, 2026 | 2:06 AM

గుంజలూరు శివారులో రోడ్డు ప్రమాదం

01-06-2026 12:40 AM

చివ్వెంల, మే 31 :మండలంలోని గుంజలూరు శివారులో జాతీయ రహదారి-65పై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హై దరాబాద్కు తరలించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన ఎస్కే జానీపాషా తన కుటుంబ సభ్యులను చిదెళ్లలోని ఉప్పలమ్మ ఆలయానికి పంపేందుకు ఆటో (ఏపీ 20 టీఏ 8311)లో పంపించారు.

ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో గుంజలూరు శి వారులో ఆటో టైరు పంక్చర్ కావడంతో ప్రయాణికులు టైరు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు (ఏపీ 40 కేసీ 1114) ను డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి వెనుక నుంచి ఆ టోను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆ టోలో ఉన్న ఆరుగురికి రక్తగాయాలయ్యా యి.గాయపడిన వారిని వెంటనే చికిత్స ని మిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఫిర్యాదుదారుడి భార్యకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ తెలిపారు.