టెట్ షెడ్యూల్ విడుదల
16 నుంచి 22 వరకు పరీక్షలు
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ) షెడ్యూల్ విడుదలైంది. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం అధికారులు టెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రతిరోజూ రెండు సెషన్‌లలో పరీక్షలు నిర్వహి స్తారు. తొలిసెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో సెషన్ మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.
జిల్లాలు, మీడియం, పేప ర్ల వారీగా వివరాలను ప్రకటంచారు. అభ్యర్థులు తేదీల వారీగా షెడ్యూల్‌ను తెలుసుకు నేందుకు ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించవచ్చని టెట్ కన్వీనర్ తెలి పారు. అయితే తొలుత విడుదల చేసిన టెట్ షెడ్యూల్‌లో కొన్ని సాంకేతిక తప్పులు ఉండడంతో దాన్ని మార్పులు చేసి మరోకసారి షెడ్యూల్ విడుదల చేశారు.






