భక్త జనసంద్రంగా యాదగిరిగుట్ట
- స్వామివారిని దర్శించుకున్న లక్షమంది భక్తులు
- వాహనాలతో కిక్కిరిసిపోయిన కొండ కింద రింగురోడ్డు
- ధర్మ, ప్రత్యేక దర్శనాలకు మూడు, రెండు గంటల సమయం
- ఆదివారం సెలవు కావడంతో మరింత పెరిగిన భక్తుల తాకిడి
యాదగిరిగుట్ట, మే 31 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తు లు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెల వు దినం కావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కువైంది. దీంతో యాదగిరిగుట్ట జన సం ద్రంలా మారింది. శనివారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీతో యాదగిరిగుట్టలో రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది.
ఆదివారం సెలవు కావడంతో సుమారు ఒక లక్ష ఒక వెయ్యి మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ తెలిపారు. శుక్ర, శని,ఆదివారాలలో అధిక శాతం సాధారణ భక్తులే స్వామివారి దర్శనం చేసుకున్నారని, రికార్డు స్థాయిలో భక్తులు వచ్చా రని అన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు.స్వామివారి నిత్య రాబడి 81,77,104 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కాగా కొండ కింద రింగురోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. కొండపైన వాహనాలు రద్దీ పెరగ డంతో కొండకింది నుంచి కొండపైకి వాహనాలను అనుమతించలేదు. కొండపైకి మెట్ల దారి వెళ్లే భక్తులు ఉదయం నుంచి 10 గంట ల వరకు రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు కొండపైన ఆలయ పరిసరాలు, శివాలయం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ప్రసాద విక్రయశాలల్లో క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. స్వామివారి దివ్య క్షేత్రంలో, కొండపైన అనుబంధ ఆలయం శ్రీరామలింగేశ్వర శివాలయంలో, పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా






