8 June, 2026 | 1:59 AM

నిత్యావసర ధరల పెంపుతో.. ప్రజాజీవితం సంక్షోభంలోకి..

08-06-2026 12:38 AM
  1. విద్యా వైద్యం రవాణా మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వాలు విఫలం               
  2. ఈనెల 10న ఛలో మేడ్చల్ కలెక్టరేట్                         
  3. జవహర్‌నగర్ మున్సిపల్ ఆఫీసు ముందు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ                       
  4. సీపీఐ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటపల్లి శంకర్       

జవహర్ నగర్, జూన్ 7 (విజయక్రాంతి): నిత్యావసర ధరల పెంపుతో ప్రజా జీవితం తీవ్ర సంక్షోభంలోకి వెళుతోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయని తప్పితే ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటపల్లి శంకర్ దుయ్యబట్టారు.

నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ ఈనెల 10వ తేదీ న మేడ్చల్ కలెక్టరేట్  ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలుపుతూ సిపిఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో జవహర్ నగర్లో గోడ పత్రిక విడుదల చేశారు.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ విద్యుత్ చార్జీలు విద్యా వైద్యం ఖర్చులు రోజురోజుకు పెరుగుతూ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెడుతున్నాయని ఈ విధానాలను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు లో భాగంగా ఈనెల 10వ తేదీన మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల బాధలను పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కు పెద్దపీట వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతోందని మరోవైపు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయన్నారు. సాధారణ కుటుంబం నెల వారి ఖర్చులు భరించలేని పరిస్థితికి చేరు కొన్నాయన్నారు.  బియ్యం పప్పులు కూరగాయలు వంటనూనె గ్యాస్ సిలిండర్ పాల ధరలు పెరుగుతుండడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఎన్నికల సమయంలో అచ్చే దిన్ లు వస్తాయని చెప్పిన పాలకులు ప్రజలు ఇప్పుడు అప్పుల పాలుకు చేరుకున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకున్నాయని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఈ విధంగా నష్టపోతున్నారని తెలిపారు. వినియోగదారులకు మాత్రం అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారని నిలదీశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ధరలను కూడా నియంత్రించక లేకపోవడం సిగ్గుచేటన్నారు.

విద్యా వైద్యం రవాణా వంటి మౌలిక సేవలు సామాన్యులకు భారంగా మారడానికి కారణమైన ప్ర భుత్వాలు తమ విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యాయి అని తెలిపారు. ప్రజల జీవన ప్రణామాలు దిగజారుతున్న పాలకులు ప్రచార అర్బాటాలు మాత్రం కార్పొరే ట్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

ఇకనైనా పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ద్వారా తగ్గించాలని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జూన్ 10వ తేదీన ఉదయం 11 గంటలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన కార్య క్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు కార్మికులు రైతులు యువత మహిళలు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని తోటపల్లి శంకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యు లు నరసింహులు, సిపిఐ కాప్రా మండల కార్యదర్శి యాదగిరి, గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూప, ఏఐటిసి మండ ల అధ్యక్షులు ఎల్లయ్య, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు జయమ్మ, మల్లిక, మాధవి, తదితరులు పాల్గొన్నారు.