పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్ష
నిర్మల్ జులై 8 (విజయక్రాంతి): ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పదివేల జరినామ విధిస్తూ బుధవారం నిర్మల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేషన్ కోర్ట్ జడ్జి శ్రీమతి శ్రీ వాణి తీర్పునిచ్చినట్టు జిల్లా ఎస్పీ జానక్షేమల తెలిపారు. కేసు వివరాలు వెల్లడించారు.
2022 సంవత్సరంలో కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన బనెల్లి విఠల్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన 09 ఏళ్ల బాలికకి చాక్లెట్ల ఆశ చూపి, ఆ బాలిక తో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి పా ల్పడ్డట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు ఈ ఘోర ఘటనపై కుబీర్ పోలీ స్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు.
కేసు విచారణ సందర్భంగా సంబంధిత సాక్ష్యాలు, ఆధారాలను పరిశీలించిన తరువాత, బుధవారం నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి శ్రీవాణి గారు, నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు రూ.10,000/- జరిమానా విధించారు. ఎస్పీ డా.జి.జానకి షర్మిల మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ కూడా శిక్ష నుండి తప్పించుకొలేరని ఎస్పీ తెలిపారు.
నిర్మల్ పోలీసులు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ న్యాయ నిరూపణ జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పోలీసు శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడటానికి తగిన సాక్షులను న్యాయస్థానాలలో ప్రవేశపెట్టటానికి నిర్మల్ పోలీసులు కృషి చేస్తున్నారు.. నిందితుడి శిక్ష పడడంలో కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి, విచారణ అధికారులు సాయి కిరణ్, ఐపీఎస్, ఎస్‌ఐ షరీఫ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ అయిన శ్రీనివాస్, లైజెనింగ్ ఆఫీస ర్స్ అయిన రమేష్ ఎస్‌ఐ,ప్రభాకర్ HC,లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






