15న హెల్త్ కార్డులు జారీ చేయాలి
09-07-2026 12:57 AM
సీఎస్‌ను కలిసిన టీజీవో సంఘం నేతలు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15న ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేయాలని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు, ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణ రావును బుధవారం కలిసి వినతిపత్రాలను సమర్పించారు. ఏసీబీ కేసుల్లో ఉద్యోగుల సర్వీసు కాలాన్ని తగ్గించాలని కోరారు. ఈ నెల 15న హెల్త్ కార్డులు జారీ చేస్తారని ఉదోగులందరూ ఆశిస్తున్నారని వారు తెలిపారు.






