21 April, 2026 | 11:29 PM

ముండ్ల పొదలను తొలగించాలని సర్పంచ్ కు వినతి

21-04-2026 08:08 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దొమకొండ మండల కేంద్రంలో నీ ఆనంద భవనం ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు తొలగించి భద్రతా చర్యలు తీసుకోవలెనని రామ యువకులు సర్పంచ్ ఐరేని నరసయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. దొమకొండ శాఖ గ్రంథాలయం ముందు గల గడికోటకు సంబంధించిన ఆనంద భవనం ప్రాంగణం ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉండుట వలన పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు, ఇతర పెద్ద పెద్ద మొక్కలు విస్తారంగా పెరిగి ఉన్నా యన్నారు. అదేవిధంగా, ఆ ప్రదేశంలో పాముల పుట్టలు కూడా ఏర్పడి ఉన్నాయి.

ఈ పరిస్థితుల కారణంగా విషపూరిత పాములు ఇతర ప్రమాదకర జంతువులు ఆ ప్రదేశంలో నివాసం ఏర్పరచుకుని, తరచూ గ్రంథాలయం వైపు వస్తున్నాయి. దీని వలన గ్రంథాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పాఠకులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, మహిళలు తీవ్ర అసౌకర్యాన్ని, భయాన్ని అనుభవిస్తున్నారు.

గ్రంథాలయం అనేది విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే స్థలం కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన వారి చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఏ సమయంలోనైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ఇది అత్యంత గంభీరమైన సమస్యగా మారింది.

అందువల్ల, దయచేసి వెంటనే చర్యలు తీసుకుని:

ఆనంద భవనం ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రపరచించడం,

పెరిగిన పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు తొలగించడం,

పుట్టలను తొలగించి స్థలాన్ని సురక్షితంగా మార్చడం,

అవసరమైతే చుట్టూ పరహారి గోడ లేదా రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం

వంటి చర్యలు తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము.

మీరు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి త్వరితగతిన చర్యలు తీసుకుని గ్రంథాలయ పాఠకుల భద్రతను కాపాడగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాముని కోరారు. అనంతరం సర్పంచ్ ఐరన్ నర్సయ్యను శాలువాతో సన్మానం చేశారు. వారి వెంట దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, గ్రంథ పాలకురాలు మౌనిక కు వినతి పత్రాన్ని యువకులు అందజేశారు.