21 April, 2026 | 10:51 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు

21-04-2026 08:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని  సుగ్లంపల్లిలో మంగళవారం సాయంత్రం సుల్తానాబాద్ సింగిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్ఓ శ్రీమల  సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, కౌన్సిలర్ ఈర్ల స్వరూప శేఖర్, సింగిల్ విండో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీఈవో బూరుగు సంతోష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.