29 June, 2026 | 3:25 AM

బడి.. బడా దోపిడీ!

29-06-2026 02:11 AM

దశాబ్దాలుగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ఫీజుల దందా

  1. విద్య పేరుతోనే ఏటా వేల కోట్ల వ్యాపారం 
  2. ట్యూషన్ ఫీజే ఏడాదికి రూ.11 వేల కోట్లు 
  3. డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫామ్స్, ట్రాన్స్‌పోర్ట్ కలిపితే రూ.15 వేల కోట్లని అంచనా 
  4. నిబంధనలు పాటించని స్కూల్ యాజమాన్యాలు
  5. కమిటీలు, విద్యాకమిషన్ సిఫారసులు బుట్టదాఖలు 
  6.    12 ఏళ్లుగా అటకెక్కిన ఫీజుల నియంత్రణ చట్టం

* విద్య.. ఇదో మంచి వ్యాపారం. అస్సలు నష్టాలుండవు. నాలుగు రెట్ల లాభాలు.. విద్య ఒకప్పుడు సేవా రంగం కాగా.. ఇప్పుడు వ్యాపారం. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు బడిని బడా దోపిడీకి కేంద్రబిందు వుగా మార్చుకున్నాయి. ఏటా 30 నుంచి 40 శాతం పెంచుతూ.. ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు లాగా విరాజిల్లుతోంది.

ఫీజుల నియంత్రణ చట్టం అమలుకు నోచుకోక.. ప్రతి ఏటా వేల కోట్లకు విద్యాదందా పడగలెత్తుతోంది. ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు, ట్రాన్స్‌పోర్టు, పుస్తకాలు, యూనిఫామ్స్, యాక్టివిటీ ఫీజుల పేరుతో సమారు రూ.11 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు యథేచ్ఛగా సాగుతోంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే అడ్మిషన్లకు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఇంగ్లిష్ మీడియం చదివిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో పేరెం ట్స్ తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ఫీజులను లక్షల్లో వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోనే కాదు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లోనూ ఫీజులు భారీగా వసూల్ చేస్తున్నారు. వరంగల్ నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీకి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని పలు ఇంజినీరింగ్ ఫీజుల కంటే కూడా ఇది ఎక్కువే. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సీబీఎస్‌ఈ పేరుతో రూ.లక్ష నుంచి 1.5 లక్షలు, ఇదే విద్యను అందించే మరికొన్ని పాఠశాలలు రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు వర కు వసూలు చేస్తున్నాయి. ప్రతి ఏడా ది ఫీజులను 30 నుంచి 40 శాతం వరకు పెంచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల వరకు పాఠశాలలు న్నాయి.

గత ఏడాది విద్యాశాఖ గణాంకాల ప్రకారం వీటిలో దాదాపు 36 లక్షల మంది టెన్త్ వరకు చదువుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చదువుతున్న వారు ఇందులో 60 శాతం వరకు విద్యార్థులు ఉంటారు. కొన్ని స్కూళ్లు టెన్త్ క్లాస్‌కు హాస్టల్‌తో కలిపి రూ.2 లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సం ఘాల నాయకులు చెప్తున్నారు. అయితే ఓ మోస్తరు స్కూళ్లలో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులున్నాయి. 

ట్యూషన్ ఫీజులే 11 వేల కోట్లు..

నేషనల్ సాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) 80వ రౌండ్-2025 ఫలితాల ప్రకారం.. ప్రైవేట్ స్కూళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షిక ఖర్చు రూ.35,104 ఉండగా, పట్టణాల్లో రూ.41,475గా ఉంది.దీనిప్రకారం చూసుకుంటే 36లక్షల మంది విద్యార్థులకు సగటున రూ. 30 వేల చొప్పున వేసుకున్నా సుమారు రూ.11 వేల కోట్ల వరకు వ్యాపారం రాష్ట్రం లో సాగుతోంది. ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే.

వీటికి అదనంగా డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫామ్స్, ట్రాన్స్ పోర్ట్, యాక్టివిటీ ఫీజులు కలుపుకొంటే అవి మూడు నాలుగు వేల కోట్లు అంటే ఏడాదికి మొత్తంగా రూ.11 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు విద్యా వ్యాపారం సాగుతుందని విద్యావర్గాల అంచనా. సింగపూర్, హాంకాంగ్ విదేశీ కంపెనీలు సైతం హైదరా బాద్‌లో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టాయి.

రూ.500 కోట్ల నుంచి రూ.1500 కోట్లను వెచ్చించి స్కూళ్లను కొనుగోలు చేశాయి. ఈ భారమం తా ఫీజుల పెంపు ద్వారా తల్లిదండ్రులపై వేస్తున్నారు. రూ.20 వేల నుంచి రూ.35 వేల ఫీజు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని బడ్జె ట్ స్కూళ్లు కూడా సీబీఎస్‌ఈకి మారి కనీసం రూ.50 వేలు వసూలు చేస్తున్నాయి. 

రిపోర్టులు, కమిటీలన్నీ ఉత్తిమాటేనా?

చదువుల పేరుతో లక్షలు దోపిడీ చేస్తుండటంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఉంది. గత బీఆర్‌ఎస్ దాదాపు అధికారంలో పదేళ్లుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెం డున్నరేళ్లు పూర్తి చేసుకుంది. అంటే ఈ ప న్నేండున్నరేళ్లలో ఫీజులను నియంత్రిస్తామ ని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెబుతూనే ఉన్నారు. కానీ దాన్ని మాత్రం అమలు చేయడంలేదు. కమిటీల పేరు తో కాలయాపన చేస్తూ చేతులుదులు ఎత్తేస్తున్నారు. చివరకు ఏ ప్రభుత్వమొచ్చినా ఏమీ చేయదనే భావనకు తల్లిదండ్రులు వచ్చేశారు. 

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టం లేదు. దీంతోనే ప్రైవేట్ పాఠశాలలు రెచ్చిపోతున్నాయి. 1994 జీవో నెం.1 ప్రకారం ఫీజులను ఒక కమిటీ వేసి నిర్ణయించాల్సి ఉం టుంది. ఇందులో పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్, పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు ఉండాలి. వసూలు చేసిన ఫీజుల్లో 5 శాతానికి మించి యాజమాన్యం తీసుకోకూడదు.

మిగిలిన దాంట్లో 50 శాతం టీచర్ల వేతనాలకు, 15 శాతం పాఠశాల నిర్వహణ, 15శాతం స్కూల్ అభివృద్ధికి, 15శాతం ఫీజును స్కూల్ సిబ్బందికి బీమా, భవిష్య నిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. 2008 జీవో నెం.90, 91, 92 ప్రకారం.. ఫీజు నిర్ణయించేందుకు డీఈవో, ఎన్‌జీవో ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలి. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా ఉండాలి.

ఈ కమిటీ పాఠశాలను పరిశీలించి, మౌలిక సదుపాయాలు, సిబ్బంది, నిర్వహణను చూసి ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై నివేదిక ఇస్తుంది. అలాగే విద్యాసంస్థలకు ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్ వంటి పదాలను పెట్టకూడదు. జీవో 88 ప్రకారం.. 200 మంది విద్యార్థులు చదివే స్కూల్‌కు 700 చదరపు మీట్ల విస్తీర్ణంలో గ్రౌండ్ ఉండాలి. అగ్నిమాపక సామగ్రి అందుబాటులో ఉండాలి.

విద్యాహక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలి. దీనికి తోడూ 25 శాతం సీట్లు పేదల కు ఉచితంగా కేటాయించాలి. కానీ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తేనే తప్ప వీరు తనిఖీలు చేయరు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే జోక్యం చేసు కుంటున్నారు. ముందస్తు నియంత్రణ అస్స లు లేదు. నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవచ్చు. గుర్తింపునూ రద్దు చే యొచ్చు. కానీ ఇదంతా తూతూ మంత్రంగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి.

మౌలిక వసతులు కరువు

తల్లిదండ్రులు వేలు, లక్షల రూపాయలు పోసి.. తమ పిల్లలను మరీ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కానీ, కొన్ని స్కూళ్లలో సరైన వసతులు కూడా ఉండవు. ఆట స్థలాలులేవు, ల్యాబ్‌లు ఉండవు, టీచర్లు-..స్టూడెంట్ నిష్పత్తి సరిగా ఉండదు. ‘బ్రాండ్’ పేరుతోనే దోపిడీచేస్తున్నారు. ఇరుకు గదు లు, సామర్థ్యానికి మించి విద్యార్థుల స్ట్రెంత్ ఉంటుంది. పలు సెక్షన్లు ఉంటాయి.

అక్షరాలతో విద్యా వ్యాపారం

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అక్షరాలతో విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఎల్‌కేజీ విద్యకు లక్ష రూపాయలు ఫీజు వసూలు చేస్తూ...అదనంగా మళ్లీ అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్స్, షూ, టై, బెల్టు అంటూ దోపిడీ చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్, ఐఐటీ అంటూ ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఫీజులపై నియంత్రణ అవసరం. చట్టం తీసుకురావాలి. 

  కసిరెడ్డి మణికంఠ రెడ్డి, 

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

ఫీజుల నియంత్రణ కోసం వేసిన కమిటీలు,- నివేదికలు

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో

1. ప్రొ.తిరుపతిరావు కమిటీ --2017

-- కమిటీ చైర్మన్: ప్రొఫెసర్ తిరుపతిరావు

-- నివేదికను 2020లో ప్రభుత్వానికి సమర్పించింది.

కీలక సిఫారసులు:

1. యాజమాన్యాలు 10 శాతం లోపు ఫీజులు పెంచుకోవచ్చు.

2. 15 శాతం కంటే ఎక్కువ పెంచాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

- అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లోనే పెట్టింది.

 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో

- మంత్రివర్గ ఉపసంఘం

- జూలై 2024 లో వేశారు.

సభ్యులు : మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్.

- ఫీజుల నియంత్రణ అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపింది.

- ఈ కమిటీ చర్చల తర్వాత తెలంగాణ విద్యా కమిషన్‌ను నియమించారు.

3. తెలంగాణ విద్యా కమిషన్ -

-- చైర్మన్‌గా ఆకునూరి మురళి, సభ్యులుగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జ్యోత్స్న, శివారెడ్డి.

- తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు--2025ను ప్రభుత్వానికి సమర్పించింది

- కీలక సిఫారసులు:

1. ప్రైవేట్ స్కూళ్లు రెండేళ్లకోసారి గరిష్ఠం గా 8 శాతమే ట్యూషన్ ఫీజు పెంచాలి.

2. అంతకంటే ఎక్కువ పెంచాలంటే ‘రాష్ట్రస్థాయి కమిషన్’ నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి.

3.వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా పెంపు ఉండాలని సూచించింది.

4. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను పూర్తిగా దోపిడీ చేస్తున్నాయని నివేదికలో స్పష్టం చేసింది.

టీజీ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ

సెప్టెంబర్1, 2025న ఈ కమిటీ వేశారు.

- చైర్మన్‌గా డాక్టర్ కే కేశవరావు

- సభ్యులుగా ఎమ్మెల్యే డాక్టర్ కడియం శ్రీహరి, ఆకునూరి మురళి, సీఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి యోగి తా రాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్, వీ బాలకిష్టారెడ్డి, చైర్మన్ నిర్ణ యం ప్రకారం మరో సభ్యుడు.

ఈ కమిటీ ఇంకా విధివిధానాలను, విద్యావిధానంపై ఇంకా అధ్యయనం, పనిచేస్తూనే ఉంది.

- ప్రభుత్వాలూ కమిటీలు వేసి, నివేదికలు తెప్పించుకున్నాయి. కానీ ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ చట్టం మా త్రం అమలులోకి రాలేదు. దీంతో 2017 నుంచి 2026వరకు ఫీజుల దోపిడీ య థేచ్ఛగా కొనసాగుతోందని విద్యార్థి సం ఘాలు విమర్శిస్తున్నాయి.

హైకోర్టు స్టే తెచ్చుకుని అధికంగా ఫీజులు వసూళ్లు

జీవో నెం.42 ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.9200, అర్బ న్ ప్రాంతాల్లో రూ.12,500 ఫీజులను 6-10వ తరగతులకు ఉండాలి. కానీ దీనిపై కోర్టు స్టే తెచ్చుకుని అధికంగా ఫీజులను దండుకుంటున్నారు. ఎక్‌కేజీ, నర్సరీలకు హైదరాబాద్, మాదా పూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఫీజులు ఉన్నాయి.

 ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అమలు చేయడంలే దు. స్కూళ్లను దుకాణాలుగా మార్చి యూనిఫామ్స్, టెక్స్ బుక్స్, టై, షూ, బెల్టులు అమ్ముతున్నారు. ఫీజుని యంత్రణ చట్టం తీసుకుని రావాలని అనేక కమిటీలు వేసినా అమలు కాలే దు. ప్రైవేట్ స్కూళ్లు అధికారులను మే నేజ్ చేస్తున్నాయి.     

    టీ నాగరాజు, 

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకార్యదర్శి