30 April, 2026 | 4:06 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి

30-04-2026 03:02 PM

ఎంపీ నివాసంలో కలిసిన భాజపా నాయకులు

కలెక్టర్ తో మాట్లాడి డీసీఎంఎస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ 

పాపన్నపేట,ఏప్రిల్30: మండల పరిధిలోని కొడపాక గ్రామంలో క్రాప్ ఎక్కువగా ఉన్నందున ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని పాపన్నపేట మండల భాజపా నాయకులు ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో గురువారం కలిసి వినతి పత్రం అందించారు. డీసీఎంఎస్ నూతన సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు కలెక్టర్ తో మాట్లాడి నూతన సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగభూషణం, మండలాధ్యక్షుడు సంతోష్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌస్ పాషా, ఉపాధ్యక్షులు బొక్కల భాగేష్, బీజేవైఎం మండలాధ్యక్షులు జగదీష్, తదితరులున్నారు.