పని ప్రదేశాలలో వ్యక్తిగత భద్రత అవసరం
30-04-2026 03:00 PM
బోథ్,(విజయక్రాంతి): పని ప్రదేశాలలో కూలీలు వ్యక్తిగత భద్రతతో పాటు పని ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కోరారు. గురువారం మండలంలోని నక్కలవాడ లక్ష్మీపూర్ గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఏప్రిల్ 14 లోపు కూలీలకు సంబంధించిన వేతనాలు విడుదల కావడం జరిగిందని మరో అయిదు వారాలపాటు జాగ్రత్తగా కూలి పనులను చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు. కూలీలకు పని ప్రదేశంలో కూర్చోవడానికి నీడ త్రాగునీరు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జగదే రావు టీఏ చంద్రశేఖర్లు ఉన్నారు






